తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్​ఎంసీ వద్ద భాజపా కార్పొరేటర్ల ధర్నా.. నిధులు నిల్- అప్పులు ఫుల్ అంటూ నినాదాలు

BJP corporators Dharna at GHMC : జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట భాజపా కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. సర్వసభ్య సమావేశం రెండ్రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులు నిల్- అప్పులు ఫుల్ అంటూ నిరసన చేపట్టారు. బల్దియా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటూ జీహెచ్​ఎంసీ అధికారులను నిలదీశారు.

GHMC OFFICE
GHMC OFFICE

By

Published : Sep 20, 2022, 10:42 AM IST

BJP corporators Dharna at GHMC : జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశం రెండ్రోజులు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ నిధులు నిల్- అప్పులు ఫుల్ అంటూ నిరసనకు దిగారు. బల్దియా కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదంటూ భాజపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించారు.

GHMC contractors protest : ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు పలువురు భాజపా కార్పరేటర్లు మద్దతు తెలిపారు. మొదట లిబర్టీ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన బల్దియా కాంట్రాక్టర్లు అక్కడి నుంచి జీహెచ్​ఎంసీ కార్యాలయం ముట్టడికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించారు. కొత్తకొత్త నిబంధనలతో జీహెచ్​ఎంసీ తమను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంట్రాక్టర్లు వాపోయారు. పెండింగ్‌లో ఉన్నరూ.800కోట్ల బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.

నేడు జరగబోయే జీహెచ్​ఎమ్​సీ పాలకమండలి సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. ప్రస్తుత పాలకమండలి నిర్వహించబోతున్న నాలుగో జనరల్ బాడీ మీటింగ్ కోసం అధికార తెరాస, ప్రతిపక్ష కార్పొరేటర్లు తమ గళం వినిపిచేందుకు సిద్ధమయ్యారు. మూడు నెలలకోసారి సమావేశం జరగాల్సి ఉన్నా.. రకరకాల కారణాలతో వాయిదా పడి ఐదు నెలల తర్వాత బల్దియా జనరల్ బాడీ మీటింగ్ జరగబోతోంది.

ABOUT THE AUTHOR

...view details