ఈ నెల 6వ తేదీలోపు 50 శాతం మండల కమిటీలు పూర్తి చేయాలని పదాధికారులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సూచించారు. హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో లక్ష్మణ్ సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ప్రేమేందర్రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్లు, విజయరామారావు, రవీంద్రనాయక్, చింతా సాంబమూర్తి సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే 34వేల బూత్ కమిటీలకు 14 వేలు పూర్తి కాగా... మిగిలిన 21 వేల కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నవంబర్ చివరి వరకు జిల్లా కమిటీలు పూర్తి చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు పార్టీ నేతలకు లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 6న సంస్థాగత ఎన్నికలపై సమీక్షించేందుకు రాధామోహన్ సింగ్ వస్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నేతలకు సూచించారు.
"మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి" - bjp meeting hyderabad
భాజపా రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, పోలింగ్బూత్ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు, సభ్యత్వం తదితర అంశాలపై చర్చించారు.
BJP CORE COMMITTEE MEETING ON BOOTH LEVEL COMMITTEES