హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరుగింది. భేటీలో నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'నమో భారత్- నవ తెలంగాణ' నినాదంతో సెప్టెంబర్ 17 కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. భాజపాలో నేతల చేరికలపై ప్రత్యేక దృష్టి, 15 రోజులకోసారి కోర్ కమిటీ సమావేశం, తాజా పరిస్థితులను విశ్లేషించుకుని కార్యాచరణను రూపొందించుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు. తెరాస ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నడ్డా సూచించారు. కోర్ కమిటీ భేటీ అనంతరం భాజపా కార్యాలయంలోనే నడ్డా బస చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, మురళీధరరావు సమావేశానికి హాజరయ్యారు. భేటీలో ఎంపీలు డి.అర్వింద్, బండి సంజయ్, సోయం బాబూరావుతో పాటు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్ పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17 నుంచి 'నమో భారత్- నవ తెలంగాణ' - BJP CORE COMMITTEE MEETING CHAIRED BY NADDA
హైదరాబాద్ భాజపా కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 'నమో భారత్- నవ తెలంగాణ' నినాదంతో సెప్టెంబర్ 17 కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
![సెప్టెంబర్ 17 నుంచి 'నమో భారత్- నవ తెలంగాణ'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4172174-thumbnail-3x2-ppp.jpg)
BJP CORE COMMITTEE MEETING CHAIRED BY NADDA
జేపీ నడ్డా అధ్యక్షతన భాజపా కోర్ కమిటీ భేటీ
Last Updated : Aug 18, 2019, 11:06 PM IST