హుజూర్నగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయిన కోర్ కమిటీ సమావేశానికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్రావు, జాతీయ అధికార ప్రతినిధి మురళీధర్ రావు, చింతా సాంబ మూర్తి, గరికపాటి మోహన్ రావు, వివేక్ హాజరయ్యారు. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారానికి జాతీయ నాయకత్వం, కేంద్ర మంత్రులను రప్పించడం వంటి అంశాలపైన నేతలు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.
హుజూర్నగర్ ఉపఎన్నికపై భాజపా నేతల మథనం - హుజూర్నగర్ ఉపఎన్నికపై భాజపా నేతల మథనం
హైదరాబాద్లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆపార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. హుజూర్నగర్ ఉపఎన్నికలో అనుసరించాల్సి వ్యూహ ప్రతివ్యూహాలపై ముఖ్య నేతలు మథనం జరుపుతున్నారు. ప్రచారానికి ఎవరెవరిని రంగంలో దించాలన్న అంశంపై నేతలు చర్చిస్తున్నారు.
![హుజూర్నగర్ ఉపఎన్నికపై భాజపా నేతల మథనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4594327-thumbnail-3x2-ppp.jpg)
BJP CORE COMMITTEE MEETING ABOUT HUZURNAGAR BY ELECTIONS
TAGGED:
HYD_BHARAT