BJP Meeting: భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోడు భూముల సమస్య, ధరణికి వ్యతిరేకంగా దీక్షతో పాటు ఈనెల 21 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 'పల్లె ఘోష.. భాజపా భరోసా' పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర వచ్చేనెల 2వ తేదీన ప్రారంభిస్తారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రేపు బండి మౌనదీక్ష: ధరణి పోర్టల్ ఇబ్బందులు, పోడు భూముల సమస్య, ఆదివాసీలపై దాడులకు నిరసనగా రేపు కరీంనగర్లో బండి సంజయ్ ఒకరోజు మౌనదీక్ష చేయనున్నారు. రేపు బండి సంజయ్ పుట్టిన రోజు అయినా కూడా దీక్షలో పాల్గొంటున్నట్లు తరుణ్ చుగ్ తెలిపారు. 30 మంది రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమంలో విడివిడిగా పాల్గొంటారు. నేతలు ప్రతి గ్రామాన్ని బైక్‌లపై పర్యటించి ఇబ్బందులు తెలుసుకుంటారు.