జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ రాంచందర్ రావు స్పష్టం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను నిలబెడుతామన్నారు. భాజపాకు మేయర్ పదవి ఇవ్వాలనే నగర ప్రజలు 48 సీట్లలో గెలిపించారని పేర్కొన్నారు. భాజపాకు, తెరాసకు మధ్య కొన్ని వేల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు.
'జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో భాజపా పోటీ చేస్తుంది'
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో భాజపా పోటీచేస్తుందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు వెల్లడించారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను నిలబెడతామని పేర్కొన్నారు. భాజపా, తెరాసకు మధ్య కొన్ని ఓట్ల తేడానే ఉందని చెప్పారు.
Ramachandra Rao
మేయర్ ఎన్నికలో గెలుపు, ఓటములతో సంబంధం లేదని రాంచందర్ రావు తెలిపారు. మజ్లిస్ పోటీ పెడుతుందో లేదో తెలియదని.. అది ఆ పార్టీ వ్యక్తిగత విషయమని పేర్కొన్నారు. తెరాస, మజ్లిస్ పార్టీలు దోస్తులని.. ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇదీ చదవండి :ధన్యవాద సభతో వేడెక్కనున్న సాగర్ రాజకీయం
Last Updated : Feb 9, 2021, 9:37 PM IST