మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై జియాగూడ భాజపా కార్పొరేటర్ అభ్యర్థి దర్శన్, ఎన్నికల ఇంఛార్జి బొడిగె శోభ ఖండించారు. పీవీ, ఎన్టీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసినా... ఇంతవరకు సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు.
'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి' - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020
హైదరాబాద్ జియాగూడ డివిజన్లో భాజపా అభ్యర్థి దర్శన్, ఎన్నికల ఇంఛార్జి బొడిగె శోభ మీడియా సమావేశం నిర్వహించారు. మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు ఓటేయాలని కోరారు.
'ప్రజలు ఇప్పటికైనా గ్రహించి భాజపాకు ఓటేయాలి'
అనుచిత వ్యాఖ్యలు చేసిన సదరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలని శోభ డిమాండ్ చేశారు. వరద సమయంలో బస్తీకి రాని కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికైనా... గ్రహించి భాజపాకు ఓటు వేయాలని కోరారు.