బెదిరింపులు, అబద్దపు హామీలతో గెలవలేరని... ఇప్పటికైనా తెరాస గుర్తించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగిన సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. నృత్యాలు చేస్తూ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక లెక్కింపులో భాజపా ఆధిక్యంలో కొనసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.
BJP Celebrations: భాజపా సంబురాలు... కార్యకర్తల నృత్యాలు, డప్పు దరువులు - నృత్యాలు చేసిన భాజపా శ్రేణులు
హుజూరాబాద్ ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో కొనసాగుతుండగా ఆ పార్టీ శ్రేణులు డప్పు, దరువులకు నృత్యాలు చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సంబురాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో భాజపా శ్రేణుల సంబురాలు
బండి సంజయ్‌ని భుజాల మీదకు ఎత్తుకున్న కార్యకర్తలు.. డప్పు, దరువులకు నృత్యాలు చేశారు. కార్యకర్తలు బండిం సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని సందడి చేశారు. భారీగా బాణసంచా కాల్చిన కార్యకర్తలు... ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
ఇదీ చూడండి: