చంపాపేట్ డివిజన్‌లో నీటి సమస్యలతో పాటు విద్యుత్, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తానని ఆ డివిజన్ భాజపా అభ్యర్థి వంగా మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. కరోనా సమయంలో కరెంటు బిల్లులు ఎక్కువగా రావడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
చంపాపేట్ సమస్యలు ఏడాదిలో పరిష్కరిస్తా: భాజపా అభ్యర్థి - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
చంపాపేట్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని భాజపా అభ్యర్థి వంగా మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధికి నోచుకోని ఆ ప్రాంతాన్ని ఏడాదిలో మార్చుతానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెరాస నేతలు గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు.
చంపాపేట్ సమస్యలు ఏడాదిలో పరిష్కరిస్తా: భాజపా అభ్యర్థి
ఆరేళ్ల నుంచి పింఛన్లు, రేషన్‌కార్డులు కొత్తవి ఇవ్వడం లేదని... ఎన్నికల సమయంలో ఎంతో అభివృద్ధి చేస్తామని పాలకులు మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. తాను గెలిస్తే ఏడాదిలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని... అభివృద్ది పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:'రోడ్లు వేసే వరకు ఓట్లు అడగొద్దు'