గచ్చిబౌలి డివిజన్లో భాజపా భారీ మెజారిటీతో గెలుస్తుందని గచ్చిబౌలి డివిజన్ భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి డివిజన్లోని గోపన్ పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి భాజపాకు విశేష స్పందన లభిస్తోందని... ఐదేళ్లుగా కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు.
గచ్చిబౌలిలో భారీ మెజారిటీ ఖాయం: భాజపా అభ్యర్థి - హైదరాబాద్ తాజా వార్తలు
బల్దియాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గచ్చిబౌలి డివిజన్లో భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని... భారీ మెజారిటీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గచ్చిబౌలిలో భాజపాకు భారీ మెజారిటీ: భాజపా అభ్యర్థి
ఈ ఎన్నికల్లో గచ్చిబౌలి డివిజన్లో భాజపా జెండాను ఎగరవేస్తామని... గ్రేటర్ ఎన్నికల్లో తెరాసకు ఓటమి తప్పదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'