జీహెచ్ఎంసీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా తనకి అవకాశమివ్వాలని హైదర్‌నగర్ డివిజన్ భాజపా అభ్యర్థి వెలగ శ్రీనివాస్.. ఓటర్లను కోరారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా డివిజన్లో కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. సొంత దేశంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినట్లు శ్రీనివాస్ చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్రీనివాస్ ప్రచారం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ప్రభుత్వం.. ఆ లెక్కలన్నీ చూపించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అవినీతి కూపంలా తయారైందని ఆరోపించారు. ప్రారంభం నుంచి చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రజా దర్బార్ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు స్థాపించి సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని తెలిపారు.