తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకి భాజపానే ప్రత్యామ్నాయం: అభిషేక్​

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో భాజపా ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్​ నియోజకవర్గంలోని వెంకటాపురం డివిజన్​లో కార్పొరేటర్​ అభ్యర్థి అభిషేక్​ ప్రచారం చేశారు. ఎన్నికల్లో భాజపాని గెలిపిస్తే డివిజన్​ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

bjp candidate campaign in venkatapuram division
తెరాసకి భాజపా ప్రత్యామ్నాయం: అభ్యర్థి అభిషేక్​

By

Published : Nov 24, 2020, 1:29 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపాకు ఓటు వేస్తే వెంకటాపురం డివిజన్​ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కార్పొరేటర్​ అభ్యర్థి అభిషేక్ హామీ ఇచ్చారు. గ్రేటర్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్​లోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా భాజపా దూసుకెళ్తోందని అభిషేక్​ అన్నారు.

డివిజన్​లో అనేక సమస్యలు ఉన్నాయని, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అభ్యర్థి వెల్లడించారు. ఇటీవల వరదల మూలంగా నష్టపోయిన ప్రజలకు పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే వెంకటాపురం డివిజన్​ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

తెరాసకి భాజపా ప్రత్యామ్నాయం: అభ్యర్థి అభిషేక్​

ఇదీ చదవండి:తెరాస, భాజపాకు ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details