కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ భాజపా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది.
రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన భాజపా
రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక, జిల్లా ఆరోగ్య కేంద్రాల వద్ద ఆందోళనకు భాజపా పిలుపునిచ్చింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ నిరసన చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించింది.
రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన భాజపా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని తద్వారా పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలని భాజపా డిమాండ్ చేస్తోంది. సంజీవని యాప్, ఆరోగ్య సేతు యాప్ ఇంటింటికి చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శ్రీలో కరోనా వైద్యాన్ని చేర్చాలనే డిమాండ్లతో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేయనుంది.
ఇవీ చూడండి: 'యోగాతో మానసిక ఒత్తడిని అధిగమించవచ్చు'