తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదు' - హైదరాబాద్ ఎన్నికలు

బౌద్ధనగర్​ డివిజన్​లో తెరాస ప్రభుత్వం ఆరేళ్లుగా చేసిందేమీ లేదని భాజపా అభ్యర్థి మేకల కావ్య ఆరోపించారు. గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె అన్నారు.

BJP bouddhanagar candidate  comments trs corporater
'ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదు'

By

Published : Nov 22, 2020, 8:25 PM IST

సీఎం కేసీఆర్ దత్తత డివిజన్​ బౌద్ధనగర్​లో అభివృద్ధి శూన్యమని భాజపా అభ్యర్థి మేకల కావ్య విమర్శించారు. ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆమె అన్నారు. పార్సిగుట్ట ప్రాంతాన్ని ప్యారిస్​లా మారుస్తామని హామీలు ఇచ్చి మరిచిపోయారని తెలిపారు.

వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కావ్య పేర్కొన్నారు. ఇంతవరకు నాలాల విస్తరణ చేపట్టలేదన్నారు. భాజపాకు అవకాశం ఇస్తే డివిజన్​లో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

'ఆరేళ్లుగా తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదు'

ఇదీ చూడండి:'గ్లోబల్ సిటీ కావాల్సిన నగరాన్ని ఫ్లడ్ సిటీగా మార్చారు'

ABOUT THE AUTHOR

...view details