తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Big Movement in Telangana : మిలియన్ మార్చ్ తరహాలో బీజేపీ భారీ ఉద్యమప్రణాళిక

BJP Ready Big Movement in Telangana : తెలంగాణలో కేసీఆర్‌ పాలన దించేందుకు బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధం అవుతోంది. మూడు విడతలుగా ఈ ఉద్యమాన్ని చేయనుందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు కె.లక్ష్మణ్ తెలిపారు. 'ప్రభుత్వం దిగి రావాలి లేదా దిగి పోవాలి' అనే నినాదంతో ఈ ఉద్యమం సాగనుందని అన్నారు.

By

Published : Aug 14, 2023, 8:07 PM IST

MP Laxman Press Meet in Hyderabad
BJP Ready to Movement in Telangana

MP Laxman Press Meet మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్న బీజేపీ

BJP Ready Big Movement in Telangana : మరో ఉద్యమానికి బీజేపీ సన్నద్ధం అవుతోందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి రావాలి లేదా దిగి పోవాలి(కేసీఆర్‌కు హటావో.. తెలంగాణ బచావో.. బీజేపీకో జితావో) అనే నినాదంతో బీజేపీ ఉద్యమ కార్యాచరణ కార్యక్రమాల రూపకల్పన చేసిందని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు పాలన పోవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం ప్రారంభం కావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

BJP Latest Movement Details : మూడు విడతలుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. మొదటి విడతలో ఆగస్ట్ 16న ప్రభుత్వ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. పల్లె బాట, బస్తీ బాట చేపడతామన్నారు. 17వ తేదీన వివిధ పథకాలు అధికార పార్టీ వారికి కాకుండా అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. బాధితులతో, దరఖాస్తుదారులతో మండల, డివిజన్‌ల వారీగా ముట్టడి కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 18న అసెంబ్లీ కేంద్రాల వారీగా ప్రధాన రహదారుల్లో రాస్తారోకోలు, ధర్నాలతో ముట్టడి కార్యక్రమాలను అసెంబ్లీ కేంద్రాల్లో చేపడతామన్నారు. రెండో విడతలో ఆగస్ట్ 23వ తేదీన అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఘెరవ్ చేస్తామన్నారు. ఆగస్ట్ 24న మంత్రుల ఘెరావ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆగస్ట్ 27న జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉంటుందన్నారు. మూడో విడత(Third Phase Movement)లో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్ తరహాలో సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Laxman fires on KTR : 'దమ్ముంటే ఆ అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయండి'

MP Laxman Latest Comments : కేసీఆర్‌ దళిత సీఎం చేస్తానని అన్నారని.. అది నెరవేరలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి కేటాయిస్తారని తెలిపారు. ఇప్పటి వరకు అది జరగలేదని వివరించారు. రాష్ట్రంలో సకాలంలో పోటీ పరీక్షలు పెట్టలేదని.. కానీ వైన్ షాపుల టెండర్లు(Wine Shop Tender) మాత్రం సమయానికి ముందే అవుతున్నాయని ధ్వజమెత్తారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని.. దీనికి ఖ్యాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు.

"రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అప్పుడు ఉద్యమం చేస్తే.. ప్రస్తుతం అవి పూర్తిగా నెరవేరలేదు. రైతులకు రుణమాఫీ చేయలేదు.. దీని వల్ల అన్నదాతల ఆత్మహత్యలు ఆగలేదు. దిక్కు తోచని స్థితిలో తెలంగాణ బతుకులు ఆగమాగం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతున్నాయి." - లక్ష్మణ్, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

MP Laxman Latest Comments : 'తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్​ వస్తుంది'

Laxman Fires on BRS Government : 'బీఆర్​ఎస్​ పాలనలో ఏ కోణం చూసినా కుంభకోణమే'

ABOUT THE AUTHOR

...view details