తెలంగాణ

telangana

ETV Bharat / state

మార్పు కోసం భాజపా అభ్యర్థులను గెలిపించాలి: బండి

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. పలు పార్టీల నేతలు విమర్శలను పెంచారు. ఈ నేపథ్యంలో ముషీరాబాద్ డివిజన్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్​ ప్రచారాన్ని వేడెక్కించారు.

bjp-bandi-sanjay-said-the-collapse-after-the-greater-election-is-imminent
మార్పు కోసం భాజపా అభ్యర్థులను గెలిపించాలి: బండి

By

Published : Nov 28, 2020, 4:44 PM IST

Updated : Nov 28, 2020, 7:53 PM IST

మార్పు కోసం భాజపా అభ్యర్థులను గెలిపించాలి: బండి

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ ప్రచారాన్ని మరింత ఉద్దృతం చేశారు. అవినీతిలో కూరుకుపోయిన తెరాస ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల తర్వాత కుప్పకూలడం ఖాయమని బండి ఆరోపించారు. ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడీ గూడ, రామ్​నగర్ డివిజన్లలో సంజయ్​ రోడ్​ షో నిర్వహించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఈ అవినీతి తండ్రి కొడుకుల పాలన అంతం కావడం ఖాయమన్నారు.

వరద బాధితుల కోసం ఈ ప్రభుత్వం 500 కోట్లు విడుదల చేసింది. కానీ ఆ డబ్బు బాధితులకు అందలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డివిజన్​కు 5 కోట్లు కేసీఆర్​ పంపాడని అన్నారు. ఓటర్లు డబ్బులు తీసుకోండి కానీ.. అభివృద్ధిని కాంక్షించే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

కేసులకు భయపడేది లేదు, చావుకి తెగించి వచ్చానని అన్నారు. పాతబస్తీలో ఆర్థిక విధ్వంసం అవుతుందని.. మార్పు కోసం తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లకు విన్నవించారు. రోడ్​షోలో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి, కవాడి గూడ, భోలక్​పూర్, రాంనగర్, అడిక్​మెట్, ముషీరాబాద్, డివిజన్ల అభ్యర్థులు రచనశ్రీ, విశ్వం, రవి, చారి, సునీత, ప్రకాష్​గౌడ్, సుప్రియ, నవీన్​తోపాటు పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఆ టైమ్ దాటితే రెండేళ్ల జైలు, జరిమానా

Last Updated : Nov 28, 2020, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details