తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'

భాజపా ప్రాజెక్టులకు, అభివృద్ధికి వ్యతిరేకం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ మార్గ నిర్దేశనంలో జరుగుతున్న లూటీకి మాత్రమే తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. లాక్​డౌన్​ సమయంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం టెండర్లు పిలవడంపై భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఫిర్యాదు చేశారు.

bjp bandi sanjay said Not against development, but against corruption in telangana
'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'

By

Published : May 23, 2020, 4:29 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం టెండర్లు పిలవడంపై భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్‌ అక్రమ సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. మార్చి 31ను రూ. 19, 862 కోట్లు, సీతారామ ప్రాజెక్టు కోసం రూ. 4, 234 కోట్లతో టెండర్లు పిలిచారని అన్నారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా కొత్తగా టెండర్లు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ప్యాకేజీల కోసం నవయుగ, ప్రతిమ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని విమర్శించారు. భాజపా ప్రాజెక్టులకు, అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. కేసీఆర్‌ మార్గ నిర్దేశనంలో జరుగుతున్న లూటీకి మాత్రమే తాము వ్యతిరేకమని అన్నారు."

-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం'

ఇదీ చూడండి :మిమిక్రీ కళాకారుడు హరికిషన్ ఇకలేరు

ABOUT THE AUTHOR

...view details