లాక్డౌన్లో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. మూడ్రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పిడుగుపాటుకు ఎందరో అన్నదాతలు మృత్యువాత పడ్డారని.. వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.
'లాక్డౌన్లో ఉన్న సమస్యలను సీఎం పట్టించుకోవాలి' - bjp bandi sanjay on ts government
కరోనా నియంత్రణతో పాటు లాక్డౌన్లో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అకాల వర్షానికి పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాలన్నారు.

'లాక్డౌన్లో ఉన్న సమస్యలను సీఎం పట్టించుకోవాలి'
మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలని, ప్రాపర్టీ టాక్స్ కట్టాలని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్యగా అభివర్ణించిన బండి సంజయ్... ముఖ్యమంత్రి ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డు నిర్ణయం ప్రకారం ఇంటివద్ద ఉండే కార్మికులందరికీ రూ.1500 అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇవీచూడండి:పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది