హైదరాబాద్లోని మీర్పేట్ మున్సిపల్ కమిషనర్ తమ పార్టీకి చెందిన దిమ్మెను అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కార్పోరేషన్ కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
భాజపా నేతలు, పోలీసుల వాగ్వాదం... ఆస్పత్రిలో కార్పొరేటర్ - హైదరాబాద్ భాజపా
నగరంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తమ పార్టీకి చెందిన దిమ్మెను మున్సిపల్ కమిషనర్ అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ కార్యకర్తలు కార్పోరేషన్ ముట్టడికి యత్నించారు.
కార్పోరేషన్ ముట్టడికి భాజపా యత్నం.. అడ్డుకున్న పోలీసులు
భాజపా నేతల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. భారీగా మొహరించిన పోలీసులు పలువురు అందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణలో 29వ వార్డు కార్పొరేటర్ లీలారవి నాయక్ సృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆమెను హాస్పిటల్కు తరలించారు.
ఇదీ చదవండి :రోడ్డు ప్రమాదం.. కారులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్