తెలంగాణ

telangana

ETV Bharat / state

కమాండ్ కంట్రోల్ కేంద్రం ముట్టడికి భాజపా యత్నం.. అడ్డుకున్న పోలీసులు - Command Control Latest News

BJP besiege On Command Control Center: హైదరాబాద్​లో కమాండ్ కంట్రోల్ కేంద్రం ముట్టడికి భాజపా నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, నేతలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్​కు తరలించారు.

BJP attempt to besiege the command control center at hyderabad
BJP attempt to besiege the command control center at hyderabad

By

Published : Nov 5, 2022, 1:04 PM IST

BJP besiege On Command Control Center: హైదరాబాద్​లోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ భాజపా జిల్లా అధ్యక్షుడు గౌతమ్‌రావుతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెరాస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కమాండ్ కంట్రోల్‌ ముట్టడికి భాజపా పిలుపునిచ్చింది. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

కమాండ్ కంట్రోల్ కేంద్రం ముట్టడికి భాజపా యత్నం

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా కమిటీల అధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ముట్టడికి పిలుపునివ్వగా ముందస్తుగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావును తార్నాకలోని నివాసంలో పోలీసులు గృహా నిర్భంధం చేశారు.

ABOUT THE AUTHOR

...view details