భాజపా, సీపీఐ, నిరుద్యోగుల.. అసెంబ్లీ ముట్టడి పిలుపుతో శాసనసభ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. అనుమానం వచ్చిన ప్రతీ వ్యక్తి ని పరిశీలిస్తున్నారు.
అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం.. ఉద్రిక్తం - హైదరాబాద్ తాజా వార్తలు
అసెంబ్లీ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా, సీపీఐ, నిరుద్యోగులు వేర్వేరుగా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ చట్టసవరణకు వ్యతిరేకంగా భాజపా ఆందోళన చేపట్టగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
![అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం.. ఉద్రిక్తం BJP attempt to Assembly Obsession](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9156849-855-9156849-1602570776505.jpg)
అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు
అసెంబ్లీ ముట్టడికి భాజపా యత్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు
జీహెచ్ఎంసీ చట్ట సవరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భాజపా.. రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటూ సీపీఐ.. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కొంతమంది భాజపా శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు.