తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ.. - తెలంగాణ రాజకీయాలు

BJP Assembly Election Plan 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. SC, ST రిజర్వేషన్‌ స్థానాలు మినహా.. 88 నియోజకవర్గాల్లో 40 సీట్లను బీసీలకు కేటాయించాలని యోచిస్తోంది. ‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యం.. బీజేపీతోనే మార్పు' అనే నినాదంతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది.

Telangana Assembly Elections 2023
BJP Assembly Election Plan 2023

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 8:38 AM IST

BJP Assembly Election Plan 2023 బీసీ నినాదంతో జనంలోకి వెళ్లనున్న బీజేపీ..

BJP Assembly Election Plan 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాడమే లక్ష్యంగా బీజేపీ బీసీల నినాదంతో జనంలోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. SC, ST రిజర్వేషన్‌ స్థానాలు మినహా.. 88 నియోజకవర్గాల్లో 40 సీట్లను బీసీలకు కేటాయించాలని యోచిస్తోంది. ‘అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యం బీజేపీతోనే మార్పు' నినాదంతో మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది.

BJP BC Plan In Assembly Election: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాషాయదళం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రధానంగా బీసీలను ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తే కలిసివస్తుందని అంచనావేస్తోంది. 119 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు కేటాయిస్తే.. బడుగు బహీనవర్గాల ఓటు బ్యాంకు పార్టీకి కలిసి వస్తుందని అంచనావేస్తోంది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు ఇవ్వలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీసీలకు 40 సీట్లు కేటాయిస్తుండగా అందులో ఐదుకు పైగా సీట్లను ముదిరాజ్‌లకు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే ముదిరాజ్‌కు చెందిన ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. తొలి అభ్యర్థుల జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే సిద్దం చేసింది. ఈ నెల 16 తరువాత 38 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించనుంది. ఇందులో బీసీలకు 9 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

BJP Candidate List 2023 Assembly Election : బీజేపీ నయా ప్లాన్​.. అసెంబ్లీ ఎన్నికల బరిలో 18 మంది ఎంపీలు

Telangana Assembly Elections 2023 : ఎన్నికల వేళ పకడ్బందీ మేనిఫెస్టోతో ముందుకెళ్లేలా కమలదళం కసరత్తు చేస్తోంది. సేద్యం, సాగునీరు, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, మహిళా అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, వివిధ రంగాలు, హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి వంటి ప్రాథమిక అంశాల్ని చేర్చాలని నిర్ణయించింది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి బీజేపీ ఏం చేయనుందనే అంశాలపై మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ నేతృత్వంలో ప్రత్యేక ఉప విభాగం కసరత్తు చేస్తోంది.

బీసీల అజెండాకు ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ నాయకత్వం సూచించిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వెనుకబడిన వర్గాల అన్ని సమస్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వివిధ కులాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ వారి సమస్యలను గుర్తించి పరిష్కారానికి వీలుగా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. బీఆర్​ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక ఛార్జిషీట్‌ను సైతం బీజేపీ రూపొందిస్తోంది. మేనిఫెస్టో, ఛార్జిషీట్లను ప్రతి ఇంటింటికీ చేర్చడం లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర నేతలు స్పష్టం చేస్తున్నారు.

BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

ABOUT THE AUTHOR

...view details