ఆర్టీసీ కార్మికుల సమ్మె 11 రోజు కొనసాగుతోంది. హైదరాబాద్లోని అన్ని బస్టాండ్లు డిపోల వద్ద ఆందోళనలు నిర్వహించారు. ఉప్పల్ డిపో కార్మికులతో కలిసి ఐకాస నేతలు వరంగల్ జాతీయ రహదారిపై మానవహారం చేపట్టారు. దీనితో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులు సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నిదానాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపో ముందు కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్, భాజపా, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. కూకట్పల్లిలో ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు.
'మొండి వైఖరి మానుకోవాలి.. లేదంటే ఆందోళన ఉద్ధృతమే' - bjp and congress support to tsrtc strike
తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సమ్మెకు విపక్షాలు మద్దతునిచ్చాయి. కూకట్పల్లిలో న్యాయవాదులు సమ్మెకు సంఘీభావం తెలిపారు.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా కూకట్పల్లిలో న్యాయవాదులు సమ్మె