తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత, ముట్టడికి యత్నించిన భాజపా కార్యకర్తల అరెస్ట్​ - ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి

BJP attack MLC kavitha House ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమె ఇంటిని భాజపా నేతలు ముట్టడించేందుకు యత్నించారు. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను అరెస్ట్​ చేశారు.

BJP attack MLC kavitha House
ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించిన భాజపా కార్యకర్తలు

By

Published : Aug 22, 2022, 5:43 PM IST

BJP attack MLC kavitha House హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి భాజపా యత్నించింది. ఈ సంఘటనలో పోలీసులు, భాజపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను అరెస్ట్​ చేశారు. పోలీసుల తోపులాటలో భాజపా కార్యకర్త స్పృహతప్పి పడిపోయారు. కవిత ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భాజపా నేతలను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన భాజపా నేతలను అరెస్ట్​ చేశారు. భాజపా నేతల ప్రకటన దృష్ట్యా కవిత ఇంటి వద్దకు తెరాస శ్రేణులు భారీగా చేరుకున్నారు.

లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో భాజపా నగర కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఒక్కసారిగా భాజపా కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. భాజపా కార్యకర్తలను తిప్పికొట్టేందుకు తెరాస కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులకు భాజపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత, ముట్టడికి యత్నించిన భాజపా కార్యకర్తల అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details