రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. పాఠశాల ఫీజులు నియంత్రించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అర్బన్ ప్రాంతాల్లో 50, గ్రామీణా ప్రాంతాల్లో 25వేలు ఫీజులు మించకుండా వసూలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో ఆట మైదానం, మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యకర్తలు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత నెలకొంది. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం - EENADU
భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు రాష్ట్ర విద్యాశాఖ డైరక్టర్ కార్యాలయాన్ని ముట్టిడికి యత్నించిగా... పోలీసు బలగాలు వారిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ఫీజులు నియంత్రించాలంటూ డిమాండ్ చేస్తూ.. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నించాయి.
విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం