తెలంగాణ

telangana

ETV Bharat / state

'గడప గడపకు నిరసన'.. ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డికి చేదు అనుభవం - ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

MLA Sai Prasad Reddy: ఆంధ్రప్రదేశ్​లో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు నిరసన ప్రభావం తప్పడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటి పన్ను చెల్లించడంపై ఎమ్మెల్యేను బాధితుడు ప్రశ్నించాడు. పన్నులు చెల్లిస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తున్నారని నిలదీశాడు. అసలేం జరిగిందంటే..?

MLA Sai Prasad Reddy
MLA Sai Prasad Reddy

By

Published : Nov 2, 2022, 12:33 PM IST

ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డికి చేదు అనుభవం

MLA Sai Prasad Reddy: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా ఆదోనిలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్​రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని 2వ వార్డులో లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వివరించారు. చిన్న గుడిసెకు రూ.1600 ఇంటి పన్ను వస్తుందని శ్రీనివాస్ అనే వ్యక్తి... ఎమ్మెల్యేను ప్రశ్నించారు.

సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ఎమ్మెల్యే అడుగగా.. తాము కట్టిన పన్నుల వల్లే కదా పథకాలు ఇస్తున్నారని సమాధానం ఇచ్చాడు. బాధితుడు ఇంటి, చెత్త పన్ను తగ్గించాలని కోరగా.. అలా కుదరదని ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details