భాగ్యనగరవాసులు మంచి ఆహారప్రియులు. లాక్‌డౌన్ సమయంలో ఇంటి తిండికే పరిమితమైనా... ఇష్టమైన బిర్యానీకి దూరమైన భావన చాలామందిలో కన్పించింది. రెస్టారెంట్ల కోసం ఎదురుచూశారు. అనుమతి ఇవ్వగానే ఆన్‌లైన్ డెలివరీలు పెరిగాయి. శాకాహారమైనా, మాంసాహారమైనా బిర్యానీనే ఎక్కువమంది ఆరగించారు. ఎంతగా అంటే నిమిషానికి ఒక ఆర్డర్ చొప్పున. ఆరు మాంసాహార బిర్యానీల ఆర్డర్లు ఇస్తే అందులో ఒకటే శాకాహార బిర్యానీ. ఆన్‌లైన్‌లో పానీపూరి, సలాడ్స్, శాండ్‌విచ్ ఆర్డర్లూ పెరిగాయి.
ఉదయం ఎక్కువగా...
ఉదయం అల్పాహారాన్ని ఎక్కువమంది ఇంటికి తెప్పించుకుంటున్నారు. వీటిలో సగటు క్యాలరీలు చూస్తే 427 వరకు ఉంటున్నాయి. ఇడ్లీ, కిచిడి, కిటో శాండ్‌విచ్‌లు, సలాడ్స్ తీసుకుంటున్నారు.