తెలంగాణ

telangana

ETV Bharat / state

Prabhas Birthday: ప్రభాస్‌ ఇంటి వద్ద సందడి... హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌ అంటూ నినాదాలు - హైదరాబాద్‌ జిల్లా వార్తలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ప్రముఖ సినీహీరో ప్రభాస్ నివాసం వద్ద సందడి నెలకొంది. ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Prabhas Birthday
Prabhas Birthday

By

Published : Oct 23, 2021, 6:43 PM IST

ప్రముఖ సినీహీరో ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సందడి నెలకొంది. యంగ్‌ రెబల్‌స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్చాలతో ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభాస్ ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్‌ చేస్తూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల నుంచి సైతం అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి తమ అభిమానాన్ని చాటారు. పెద్ద ఎత్తున వస్తున్న అభిమానులను అదుపుచేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రభాస్ నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరో ప్రభాస్ ఒక్కసారి బయటకు వచ్చి హాయ్ డార్లింగ్ అంటే చాలనీ అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రభాస్ సినిమా షూటింగ్ నేపథ్యంలో ముంబయిలో ఉన్నట్లుగా ఆయన అనుచరులు తెలిపారు.

జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్‌ నివాసం వద్ద అభిమానుల సందడి...

సినీ ప్రముఖుల నుంచి ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌లు...

మరోవైపు రెబల్‌స్టార్‌ అభిమానులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

  • "హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. జీవితంలో కేవలం ది బెస్ట్‌ మాత్రమే నీకు లభించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి నీ సినిమాలు మరింత చేరువ కావాలని కోరుకుంటున్నాను." -అనుష్క
  • "నా డార్లింగ్‌ ప్రభాస్‌ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరెన్నో విజయాలు సొంతం చేసుకోవాలని.. మరింత సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను. అరేయ్‌ వంశీ.. వచ్చేటప్పుడు ఒక కొత్త ఇంటర్నెట్‌ తీసుకురా. మన రాధేశ్యామ్‌ టీజర్‌ ఈరోజు విడుదలైంది. పాత ఇంటర్నెట్‌ బద్దలైపోయిద్దేమో’’ - నవీన్‌ పోలిశెట్టి
  • "మన గర్వం, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు. స్టన్నింగ్‌ విజువల్స్ వల్ల రాధేశ్యామ్‌ టీజర్‌ అద్భుతం, ఆసక్తికరంగా ఉంది. టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌’’ - శ్రీనువైట్ల
  • "రాజాధిరాజా రాజ మార్తాండ మహారాజా భారత సినీ పరిశ్రమను ఏలుతున్న యువరాజా శ్రీ ప్రభాస్ రాజాకి జన్మదిన శుభాకాంక్షలు’’ - బండ్ల గణేశ్‌
  • "ఈశ్వర్‌గా వెండి తెరమీద అడుగుపెట్టి, వర్షంతో అభిమానుల గుండెల్లో హర్షాతిరేకాలు ఉప్పొంగించి, ఛత్రపతితో మాస్ ప్రేక్షకులను అలరించి, బాహుబలితో కైలాసమంత ఎత్తు ఎదిగిన ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ - పరుచూరి గోపాలకృష్ణ

ఇదీ చదవండి:Radhe shyam teaser: ప్రభాస్ రాధేశ్యామ్ టీజర్ వచ్చేసింది..

ABOUT THE AUTHOR

...view details