ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. అత్యవసర వార్డు శౌచాలయంలో... అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహం లభించింది. పురిటినొప్పులతో తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళే బిడ్డను కనేసి పడేసి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు. రుతుస్రావం అయిందంటూ బాత్రూమ్ లోపలే అరగంటకు పైగా ఉన్న ఆ మహిళ... గైనకాలజిస్ట్‌ను నర్స్ పిలిచే లోపే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. శౌచాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్లిన స్వీపర్‌కు.. మగశిశువు మృతదేహం కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆసుపత్రి శౌచాలయంలో శిశువు మృతదేహం - ఆసుపత్రి టాయిలెట్లలో శిశువు మృతదేహం
ఆసుపత్రి శౌచాలయంలో అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం లభించింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పురిటినొప్పులతో తెల్లవారుజామున ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళే బిడ్డను కనేసి పడేసి ఉంటుందని ఆసుపత్రి సిబ్బంది భావిస్తున్నారు.
![ఆసుపత్రి శౌచాలయంలో శిశువు మృతదేహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4366385-295-4366385-1567847982772.jpg)
ఆసుపత్రి టాయిలెట్లలో శిశువు మృతదేహం