తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​ - telangana varthalu

హైదరాబాద్​కు మరో 15 నెలల్లో బి-హబ్​ బయో ఫార్మాస్పేస్​ అందుబాటులోకి రాబోతోందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీకి అదనంగా హైదరాబాద్‌కు మరో బయో ఫార్మాస్యూటికల్‌ హబ్‌ ఏర్పాటు కానుందని వెల్లడించారు.

KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​
KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​

By

Published : Sep 6, 2021, 12:12 AM IST

తెలంగాణలో ఫార్మా ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న జీనోమ్‌ వ్యాలీకి అదనంగా హైదరాబాద్‌కు మరో బయో ఫార్మాస్యూటికల్‌ హబ్‌ ఏర్పాటు కానుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. లక్ష స్క్వేర్‌ ఫీట్లలో రెండు దశల్లో దీని నిర్మాణం చేపడతామన్నారు.

మరో 15 నెలల్లో బి-హబ్‌ బయో ఫార్మాస్పేస్‌ అందుబాటులోకి రాబోతోందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. టీఎస్‌ ఐఐటీ, తెలంగాణ లైఫ్‌ సైన్సెస్‌ భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ కేంద్రంగా మరిన్ని ఫార్మా ఉత్పత్తులు ప్రజలకు అందుతాయని తెలిపారు.

ఇదీ చదవండి: Harish rao : చాక్లెట్లు, పిప్పరమెంట్లతో జీవితాలు బాగుపడవు : హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details