బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బియోన్ సంస్థ ఇంటివద్దే కరోనా టెస్టులు చేసుకునే కిట్‌ను తయారు చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్. రక్త పరీక్ష ద్వారా కేవలం ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు తెలుసుకోవచ్చని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థతో భాగస్వామ్యం ఉన్న సీఈ, ఎఫ్‌డీఏ అప్రూవుడ్ ఏజెన్సీల నుంచి దీన్ని సేకరించినట్లు ప్రకటించారు.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌తో ఇంటివద్దే కరోనా పరీక్షలు - బియోన్ సంస్థ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌కు రూపకల్పన
ఇంటివద్దే కరోనా పరీక్షలు చేసుకునేందుకు వీలుగా దేశంలోనే మొట్టమొదటి టెస్టింగ్ కిట్‌ని ప్రముఖ బియోన్ సంస్థ రూపొందించింది. నాణ్యత పరీక్షల అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ర్యాపిడ్ టెస్టింగ్ కిట్‌తో ఇంటివద్దే కరోనా పరీక్షలు
ఇప్పటికే ఈ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతించిందని, నాణ్యత పరీక్షల అనంతరం మార్కెట్లోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టెస్టింగ్ కిట్ ధర కేవలం రెండు నుంచి మూడు వేల రూపాయల మధ్య ఉంటుందని వెల్లడించారు. తమ వెబ్ సైట్ ద్వారా విక్రయాలు జరపనున్నట్లు తెలిపారు.
TAGGED:
covid-19, testing kit, india