తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పిల్లలకు 'కార్బెవ్యాక్స్‌' టీకా.. డీసీజీఐ నుంచి అత్యవసర అనుమతి - తెలంగాణ వార్తలు

Corbevax vaccine for Children : కొవిడ్‌-19 టీకా ‘కార్బెవ్యాక్స్‌’ను 12-18 ఏళ్ల పిల్లలకు ఇవ్వడానికి డీసీజీఐ నుంచి అత్యవసర అనుమతి వచ్చింది. ఈ విషయాన్ని హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ తెలిపింది. రిసెప్టర్‌ బైండింగ్‌ డొమైన్‌ (ఆర్‌బీడీ) ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ వ్యాక్సిన్‌ అయిన ‘కార్బెవ్యాక్స్‌’ను పెద్దలకు ఇవ్వడానికి గత ఏడాది డిసెంబరులో అత్యవసర అనుమతి లభించింది.

corbevax vaccine for Children, children corona vaccine
ఆ పిల్లలకు ‘కార్బెవ్యాక్స్‌’ టీకా

By

Published : Feb 22, 2022, 9:09 AM IST

Corbevax vaccine for Children : తాము ఉత్పత్తి చేస్తున్న కొవిడ్‌-19 టీకా ‘కార్బెవ్యాక్స్‌’ను 12-18 ఏళ్ల పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నుంచి అత్యవసర అనుమతి వచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సోమవారం వెల్లడించింది. రిసెప్టర్‌ బైండింగ్‌ డొమైన్‌ (ఆర్‌బీడీ) ప్రొటీన్‌ సబ్‌-యూనిట్‌ వ్యాక్సిన్‌ అయిన ‘కార్బెవ్యాక్స్‌’ను పెద్దలకు ఇవ్వడానికి గత ఏడాది డిసెంబరులో అత్యవసర అనుమతి లభించింది. ఫేజ్‌-2, 3 క్లినికల్‌ పరీక్షల మధ్యంతర ఫలితాల ఆధారంగా ఈ టీకాను పిల్లలకు సైతం ఇవ్వడానికి ఇప్పుడు అనుమతి లభించిందని కంపెనీ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

పిల్లలు ఈ టీకా తీసుకుంటే.. పాఠశాలలు, కళాశాలలకు హాజరయ్యేందుకు వీలవుతుందని వివరించారు. క్లినికల్‌ పరీక్షల్లో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ), ట్రెడిషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ (టీఎస్‌టీహెచ్‌ఐ) పాలుపంచుకున్నట్లు తెలిపారు. అయితే 15ఏళ్ల లోపు పిల్లలకు కొవిడ్‌ టీకా ఇచ్చే విషయమై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ్య కార్బెవ్యాక్స్‌ టీకాను ఇంజెక్షన్‌ ద్వారా ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండో డోసు తీసుకోవాలి.

ఇదీ చదవండి: Heart Attack Causes : యుక్త వయసులోనే ఆకస్మిక గుండెపోటు.. కారణాలు ఇవే..

ABOUT THE AUTHOR

...view details