Telangana Forest Development Corporation : జీవ వైవిధ్యానికి దోహదం చేయడంతో పాటు పిల్లల్లో ఆసక్తి కలిగించి, విజ్ఞానం పెంపొందించేలా సరికొత్త వనాల్ని అందించేందుకు అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. వంద ఎకరాల విస్తీర్ణం.. రెండు వేల రకాలు.. వివిధ జాతులకు చెందిన లక్ష మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులోభాగంగా చిన్నచిన్న 75 థీమ్ పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
వీటిలో దాదాపు లక్ష మొక్కలు నాటాలన్నది లక్ష్యం. ఒక థీమ్ పార్కులోకి వెళితే తెలుగు అక్షరాలు నేర్చుకోవచ్చు. మరోదాంట్లో ఎ నుంచి జడ్ వరకు ఆంగ్ల అక్షరాలు చదవచ్చు. ఇంకో చోట నిర్మల్, కొండపల్లి బొమ్మల తయారీకి వాడే చెట్ల గురించి తెలుసుకోవచ్చు. మరోచోట సంగీత పరికరాలకు వాడే కలప మొక్కల గురించి వివరాలు పొందవచ్చు. సంస్కృతీసంప్రదాయాలు, ఔషధాల గురించి.. ఇలా ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో అలరించేలా మొక్కల్ని నాటి పెంచేందుకు ఎఫ్‌డీసీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
ఒక్కోటి 300-1000 గజాల్లో:ఏడో విడత హరితహారంలో భాగంగా అటవీ అభివృద్ధి సంస్థ తనకున్న భూముల్లో మొక్కలు నాటుతోంది. ఇప్పటివరకు యూకలిప్టస్, సుబాబుల్ వంటి రకాలకే ప్రాధాన్యమిచ్చింది. పర్యావరణానికి ఇవి చేటు చేస్తుండటం.. ఈ చెట్లు ఎక్కువ నీటిని గ్రహించడం, నీడలేక పక్షుల ఆవాసం పోవడం వంటి పర్యావరణపరమైన ప్రతికూలతలున్నాయి. దీంతో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తొలిదశలో ఈ చెట్లను నరికేసి వాటి స్థానంలో ఇతర మొక్కలు నాటాలని ఎఫ్‌డీసీ నిర్ణయించింది.
థీమ్ పార్కుల్లో ఇలా..