తెలంగాణ

telangana

ETV Bharat / state

బయో ఏసియా సదస్సుకు 200మంది ప్రముఖులు - హైదరాబాద్​లో నిర్వహించనున్న బయోఏసియా సమ్మేట్​

Bio Asia Summit 2023: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్​లోని హెచ్​ఐసీసీలో బయో ఏసియా 2023 అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో 200 మందికి పైగా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు.

బయోఏసియా 2023
bioasia2023

By

Published : Jan 11, 2023, 7:47 AM IST

BioAsia Summit 2023: వచ్చేనెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్‌ మాదాపూర్‌ వేదికగా బయో ఏసియా 20వ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు 200 మందికిపైగా ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ప్రముఖుల జాబితాను ఆయన విడుదల చేశారు.

గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న సదస్సు రాష్ట్రంలో ఔషధ, జీవశాస్త్రాల అభివృద్ధికి దోహదపడిందని.. అదే స్ఫూర్తితో ఈసారి జరుపుతున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. కొవిడ్ అనంతరం.. బయో పారిశ్రామిక రంగం అవసరం మరింత పెరిగిందని మానవీకరించిన ఆరోగ్య సంరక్షణ తదుపరి తరాన్ని రూపొందించడం అనే నినాదంతో ఈసారి సదస్సు జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details