రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సు డిపోల్లో బయో డీజిల్ వినియోగించాలని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ బయోడీజిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రశేఖర్ కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం నడుం బిగించాలన్నారు. మార్చి 9న తలపెట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర కరపత్రాలను హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విడుదల చేశారు.
బయో డీజిల్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాలి : చంద్రశేఖర్ - తెలంగాణ వార్తలు
పర్యావరణం కోసం బయో డీజిల్‌ను ప్రోత్సహించాలని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ అండ్ బయోడీజిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై మార్చి 9న ప్రజాచైతన్య పాదయాత్ర చేపడుతున్నట్లు బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.
రైతులకు అడవి ఆముదం మొక్కలపై అవగాహన కల్పించి.. ప్రభుత్వమే సబ్సిడీ అందించాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కార్మాగారాన్ని ఏర్పాటు చేసి... ఆయా మండలాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బయో డీజిల్‌పై ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మేధావులు, పర్యావరణ ప్రేమికులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చంద్రశేఖర్ హెచ్చరించారు.