హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేపట్టారు. తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 9ఫోన్లు, రూ.29 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం వారిని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు.
సరూర్నగర్లో పేకాట రాయుళ్లు అరెస్ట్ - lb nagar police arrested bingo players
పేకాట స్థావరాలపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి పేకాట రాయుళ్లులను అరెస్టు చేసిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
![సరూర్నగర్లో పేకాట రాయుళ్లు అరెస్ట్ Bingo players Arrested by of Saroor Nagar police at venkateshwara colony Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6795753-thumbnail-3x2-pekata.jpg)
సరూర్నగర్లో పేకాట రాయుళ్లు అరెస్ట్
TAGGED:
nl nagar otc police