ఇవాళ సభ ప్రారంభం కాగానే రాజ్యాంగ సవరణ తీర్మానాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మరో పదేళ్ళపాటు పొడిగిస్తూ లోక్ సభ, రాజ్యసభలు ఆమోదించిన చట్టసవరణ బిల్లును సమర్థిస్తూ ముఖ్యమంత్రి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండా తీర్మానాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదించింది.
నాలుగు బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం - శాసనసభ ఆమోదం
ఎలాంటి ప్రశ్నోత్తరాలకు తావులేకుండానే ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. అభయ హస్తం తొలగింపు సహా మిగతా బిల్లులను ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున ఆయా శాఖల మంత్రులు సభలో ప్రవేశపెట్టారు.
అనంతరం ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూడు బిల్లులపై సభలో చర్చించారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రవేశపెట్టారు. 29 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగిస్తూ మరో బిల్లును హరీష్ రావు ప్రవేశపెట్టారు. లోకాయుక్త చట్ట సవరణ బిల్లును కూడా ముఖ్యమంత్రి తరఫున హరీష్ రావు ప్రవేశపెట్టారు. అభయహస్తం పథకాన్ని తొలగిస్తూ స్వయం సహాయక సంఘాల కో-కాంట్రిబ్యూటరీ పింఛన్ తొలగింపు బిల్లును పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టారు. నాలుగు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్