Bio Asia 2022: బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పాల్గొన్నారు. దృశ్య మాధ్యమంలో జరిగిన ఈ సదస్సులో ఆయనతో పాటు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పాల్గొని చర్చాగోష్ఠి నిర్వహించారు. బిల్ గేట్స్‌తో 'ఫైర్ సైడ్ చాట్'లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కరోనా మహమ్మారితో గత రెండేళ్ల ప్రపంచ అనుభవాలు, ఆరోగ్య పరిరక్షణలో కొత్త పోకడల వంటి అంశాలపై చర్చించారు.
భారత్ భేష్: బిల్‌గేట్స్
కరోనా సమయంలో భారత్ త్వరగా స్పందించిందని బిల్ గేట్స్ అన్నారు. భారత ఔషధ కంపెనీలు.. వ్యాక్సిన్లు త్వరగా తయారుచేశాయని కితాబిచ్చారు. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో భారత్ వేగంగా స్పందించిందన్నారు. భవిష్యత్తులో మానవాళిపై అనేక వైరస్‌లు దాడి చేయవచ్చని సూచించారు. కరోనా.. అనేక దేశాలకు పెను సవాలు విసిరిందన్న బిల్ గేట్స్... కరోనా వ్యాక్సిన్ ధర భారత్‌లో అందరికీ అందుబాటులో ఉందన్నారు.
కరోనా సమయంలో భారత్ త్వరగా స్పందించింది. భారత ఔషధ కంపెనీలు.. వ్యాక్సిన్లు త్వరగా తయారుచేశాయి. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలో భారత్ వేగంగా స్పందించింది. భవిష్యత్తులో మానవాళిపై అనేక వైరస్‌లు దాడి చేయవచ్చు. కరోనా.. అనేక దేశాలకు పెను సవాలు విసిరింది. కరోనా వ్యాక్సిన్ ధర భారత్‌లో అందరికీ అందుబాటులో ఉంది. వైరస్‌లపై శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ఫార్మా సంస్థల పాత్ర ఎక్కువ. వ్యాధి నిర్ధరణలో అధునాతన సాంకేతిక విధానాలు తేవాలి.