హైదరాబాద్ నగరంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. గుడిమల్కావూర్లోని ఓ కూడలి వద్ద వరద ప్రవాహంలో పలు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. కుల్సాంపురా స్కూల్ ముందు రోడ్డుపైకి నీరు చేరడం వల్ల ఆ ప్రాంతమంతా సముద్రాన్ని తలపించింది. మోకాళ్లలోతు నీటిలో వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి.
హైదరాబాద్‌లో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనాలు - rain updates in hyderabad
భాగ్యనగర్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం కురిసిన భారీ వర్షానికి గుడిమాల్కావూర్లోని వీధులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరద ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల కూడళ్ల వద్ద ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
వర్ష బీభత్సం: కొట్టుకుపోతున్న ద్విచక్రవాహనాలు