మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి(Hyderabad Rains) నగరం తడిసి ముద్దైంది. రహదారులు వాగులను తలపించాయి. ఉరుములు, మెరుపులతో వాన(Hyderabad Rains) పడి కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షానికి(Hyderabad Rains) తీవ్రనష్టం వాటిల్లింది. దిల్సుఖ్ నగర్ శివ గంగ థియేటర్(Dilsukhnagar Shiva Ganga Theatre) ప్రహరీ గోడ కూలడంతో ప్రేక్షకుల 50 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఫస్ట్ షో సినిమా చూసి థియేటర్ బయటకు వచ్చిన ప్రేక్షకులు తన బైక్లు దెబ్బతినడంతో యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గల్లంతైన వ్యక్తి సురక్షితం
ఎల్బీ నగర్లో భారీ వర్షం కారణంగా చింతల కుంట వద్ద ఓ ద్విచక్ర వాహానదారుడు వరద ప్రవాహంలో బైక్ తో సహా కొట్టకుపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. డీఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతైన వ్యక్తి కోసం గాలింప చేపట్టారు. ఘటనా స్థాలాన్ని మేయర్ గద్వాల విజయ లక్ష్మి, స్థానిక ఎమ్‌ఎల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఇంతలో గల్లంతైన వ్యక్తి సురక్షితంగా తిరిగి వచ్చాడని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గల్లంతైన వ్యక్తి సరూర్ నగర్ కు చెదిన అటో డ్రైవర్ జగదీష్ గా గుర్తించారు. మరో వైపు చంపాపేట లోని నాలలో బైక్ తో సహా వ్యక్తి కొట్టుకుపోయారని సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అవాస్తవమని గుర్తించారు.