హైదరాబాద్ టప్పాచబుత్ర పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనం చోరీ జరిగింది. గుడిమల్కాపూర్ సత్యనారాయణ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇద్దరు దుండగులు బైక్‌ను చోరీ చేశారు. ద్విచక్రవాహనాన్ని చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేస్తున్నారు.
నగరంలో పెరిగిపోతున్న బైక్ చోరీలు - Bike Stolen cctv footage in Tappachabutra latest news
నగరంలో ద్విచక్ర వాహనాల భద్రతకు కరువవుతోంది. ఆస్పత్రి ఎదుటో, కల్యాణమంటపం, షాపింగ్ కాంప్లెక్స్‌ల వద్దో, చివరికి ఇంటి ముందు వాహనాన్ని నిలిపి పక్కకు వెళ్లాలన్నా జంకే పరిస్థితి. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నా చోరీలు మాత్రం ఆగడం లేదు.
నగరంలో పెరిగిపోతున్న బైక్ చోరీలు