హైదరాబాద్‌లో బైక్ రేసింగ్ కేసులు మళ్లీ మొదలయ్యాయి. మైనర్లు ద్విచక్రహనాలను ఖాళీ ప్రదేశాలకు తీసుకెళ్లి వాహనాలపై నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ దృశ్యాలు చూసిన వారు భయాందోళన కు గురవుతున్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలంలో బైక్ రేసింగ్‌కు పాల్పడిన నలుగురు మైనర్లను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన బైక్ రేసింగ్‌లు
భాగ్యనగరంలో బైక్ రేసింగ్‌లు మళ్లీ మొదలయ్యాయి. నగరశివార్లలో ద్విచక్రవాహనాలపై ఫీట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు ఆకతాయిలు.ఉప్పల్ ప్రాంతంలో రేసింగ్‌కు పాల్పడిన నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన బైక్ రేసింగ్‌లు
గతంలో ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, పాఠశాలలు బంద్ కావడం వల్ల తాజాగా విద్యార్థులు బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: హరితహారం మొక్క తిన్న మేక యజమానికి జరిమానా