తితిదే నిర్వహిస్తోన్న బర్డ్ ఆసుపత్రి.. ప్రత్యేక ప్రతిభావంతుల ఎముకలు, కీళ్ల రోగాలకు దశాబ్దాలుగా ఉచిత సేవలందిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన, పునరావాస కేంద్రం సేవల్లో.. స్వల్ప మార్పులు చేపట్టారు. శస్త్రచికిత్స సమయంలో పరీక్షల నిమిత్తం ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చారు. 15 ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక పరికరాలు సిద్ధం చేస్తున్నారు. నిపుణులైన వైద్యుల్ని కొత్తగా నియమించనున్నారు. కృత్రిమ అవయవాల తయారీలో అనుసరిస్తున్న పాతపద్ధతుల స్థానంలో.. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.
దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్' ఉచిత సేవలు - తిరుమల తిరుపతి దేవస్థానం బర్డ్ ఆస్పత్రి తాజా వార్తలు
తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలోని బర్డ్ ఆసుపత్రి..సేవలు మరింత విస్తరించనున్నాయి. 15 ఆపరేషన్ థియేటర్లతో, అత్యాధునిక పరికరాలతో, దేశవిదేశీ నిపుణుల పర్యవేక్షణలో.. నిరుపేదలకు మరిన్ని సేవలు అందనున్నాయి. తుంటి, మోకీలు, వెన్నెముక శస్త్రచికిత్సలకు కొంత మేర ఛార్జీలు వసూలు చేయనుండగా.. మిగిలిన సేవలను ఉచితంగా అందించనున్నారు.

దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్' ఉచిత సేవలు
దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్' ఉచిత సేవలు
ఇకపై మోకీలు, తుంటి మార్పిడి వంటి శస్త్రచికిత్సలకు కొంతమేర డబ్బులు వసూలు చేయనున్నారు. శస్త్రచికిత్సకు అవసరమైన ఇంప్లాట్స్ మొత్తం రోగులే భరించాల్సి ఉంటుంది. శస్త్రచికిత్సల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదని.. బర్డ్ సంచాలకులు మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అర్హులైన నిరుపేదలకు మోకీలు, తుంటి, వెన్నెముక శస్త్రచికిత్సల వ్యయాన్ని.. ప్రాణదానం ట్రస్టు ద్వారా తితిదే అందించనుంది.
ఇదీ చూడండి:వాట్సప్ నుంచి త్వరలో ఆరోగ్య బీమా