తెలంగాణ

telangana

ETV Bharat / state

"తెలంగాణలో విత్తనరంగ అభివృద్ధి చర్యలు భేష్.." - తెలంగాణలో బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి

విత్తనరంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. వ్యవసాయ పథకాలు, విత్తన పరిశ్రమ అభివృద్ధి, పశు సంవర్ధకం, చేపల పెంపకంపై అధ్యయనం చేయడానికి మంత్రి నేతృత్వంలో బృందం హైదరాబాద్‌కు చేరుకుంది.

సమావేశం

By

Published : Sep 20, 2019, 11:48 PM IST

తెలంగాణలో బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి

తెలంగాణ వ్యవసాయరంగంలో సాధించిన పురోగతి చూసి, అధ్యయనం చేయడానికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ ప్రేమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బృందం హైదరాబాద్​కు వచ్చింది. విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి బీహార్ మంత్రి హాజరయ్యారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి మొక్కజొన్న, వరి విత్తనాల దిగుమతికి కీలక ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి గల అవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి రెండు గంటలపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి... బీహార్ బృందానికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details