తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ చేరుకున్న బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలు - హైదరాబాద్ తాజా సమాచారం

బీహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. వారికి శంషాబాద్ విమానాశ్రయంలో స్థానిక ఎంఐఎం ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు.

bihar mim mlas arrived hyderabad to met asaduddin owaisi
హైదరాబాద్ చేరుకున్న బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యేలు

By

Published : Nov 11, 2020, 8:33 PM IST

నవంబర్ పదో తేదీ వెలువడిన బీహార్ ఎన్నికల్లో గెలుపొందిన ఎంఐఎం ఐదుగురు ఎమ్మెల్యేలు భాగ్యనగరం చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్థానిక ఎంఐఎం ప్రజాప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.

బీహార్‌లోని అమౌర్, కొచాధమన్‌, జోకిహాట్‌, బైసీ, బహదూర్‌గంజ్ నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు. వీరంతా హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఓవైసీని కలువనున్నారు.

ఇదీ చూడండి:'బిహార్ లో 5 స్థానాల్లో గెలవడం చారిత్రాత్మకం'

ABOUT THE AUTHOR

...view details