బిహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఎంఐఎం అధినేతను కలిసిన బిహార్ ఎమ్మెల్యేలు - హైదరాబాద్ తాజా సమాచారం
బిహార్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఐదుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైనందుకు ఆలింగనం చేసుకుని ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు.
ఎంఐఎం అధినేతను కలిసిన బీహార్ ఎమ్మెల్యేలు
పదో తేదీన వెలువడిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో అక్తరుల్ ఇమాన్, మహమ్మద్ ఇజహర్ అస్ఫీ, షానవాజ్ ఆలం, రుకునుద్దీన్, అన్జర్ నయీమి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బిహార్‌లోని అమౌర్, కొచాధమన్, జోకిహాట్, బైసీ, బహదూర్‌గంజ్ నియోజకవర్గాల్లో వారు గెలుపొందారు.