తెలంగాణ

telangana

ETV Bharat / state

Bigg Boss 5 winner VJ sunny: మొక్కలు నాటిన వీజే సన్నీ.. మరో ముగ్గురికి గ్రీన్​ ఛాలెంజ్​ - జర్నలిస్టు కాలనీలో మొక్కలు నాటిన వీజే సన్నీ

Bigg Boss 5 winner VJ sunny: గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా బిగ్​ బాస్​ 5 విన్నర్​ వీజే సన్నీ మొక్కలు నాటారు. జూబ్లీహిల్స్​లోని జర్నలిస్టు కాలనీలో స్నేహితులతో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్​ ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటే అవకాశం ఇచ్చినందుకు ఎంపీ సంతోష్​ కుమార్​కు కృతజ్ఞతలు తెలిపారు.

vj sunny
బిగ్​బాస్​ విన్నర్​ వీజే సన్నీ

By

Published : Dec 23, 2021, 7:08 PM IST

Bigg Boss 5 winner VJ sunny: గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని బిగ్​బాస్​ 5 విన్నర్​ వీజే సన్నీ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమం మొదలుపెట్టడం అద్బుతమని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో జర్నలిస్టు కాలనీలోని జీహెచ్​ఎంసీ పార్కులో స్నేహితులతో కలిసి సన్నీ మొక్కలు నాటారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్​కుమార్​కు కృతజ్ఞతలు తెలియజేశారు.

'బిగ్​బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. మొదటిసారి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ ఛాలెంజ్​లో భాగస్వామ్యం అయ్యి మొక్కలు నాటే అవకాశం ఇచ్చినందుకు ఎంపీ సంతోష్ కుమార్​కు కృతజ్ఞతలు.' -వీజే సన్నీ, బిగ్​ బాస్​ 5 విన్నర్​

మొక్కలు నాటిన అనంతరం సన్నీ.. మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. సిరి, షణ్ముఖ్​, శ్రీరామ్​లు గ్రీన్ ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా తెలిపారు.

మిత్రులతో కలిసి మొక్కలు నాటుతున్న వీజే సన్నీ

ఇదీ చదవండి:Minister Harish on HC: కరోనా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశంపై స్పందించిన హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details