Big Twist in Ex MLA Shakeel Son Accident Case : హైదరాబాద్ ప్రజాభవన్ ముందు ఈ నెల 23న కారు బీభత్సం సృష్టించిన కేసులో, కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కుమారుడు సాహిల్ కారణమని ఇప్పటికే పోలీసులు తెలిపినప్పటికీ, ప్రస్తుతం నిందితుడిని(Accused) తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తన బదులు ఇంట్లో పనిచేసే మరొకరు కారు నడిపినట్టు చూపించాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
చెరువులోకి దూసుకెళ్లిన కారు - ప్రాణాలతో బయటపడిన నలుగురు, ఒకరి దుర్మరణం
ఈ కేసులో నిందితుడికి పోలీసులు సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం తర్వాత సాహిల్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన కొద్దిసేపటికే, మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు వచ్చి కేసులో సాహిల్ పేరు చేర్చవద్దని కోరినట్లు తెలుస్తోంది. అనంతరం పీఎస్ నుంచి సాహిల్‌ను తీసుకెళ్లడంతో, అతడి బదులు వారింట్లో పని చేసే వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు.
Ex MLA Shakeel Son Accident Case Update :నిందితుడ్ని తప్పించేందుకు జరుగుతున్న వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్ల పాత్ర ఉందన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల(CCTV Camera Footage) ఆధారంగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా కారుతో విధ్వంసం సృష్టించి రాహిల్ ఒకరి మరణానికి కారణమయ్యాడని డీసీపీ పేర్కొన్నారు.