రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ను భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి చీకటి జీవోగా అభివర్ణించారు. ప్రజల రక్తాన్ని పీల్చేందుకే ప్రభుత్వం ఇలాంటి జీవోలు తీసుకొస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎవరూ డబ్బులు కట్టకండి... ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తాం' - ఎంపీ కోమటిరెడ్డి వార్తలు
ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇప్పటికే హైకోర్టులో పిల్ వేశామని... న్యాయస్థానం ప్రజలకు మద్దతుగా తీర్పు ఇస్తుందని ఎంపీ కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని వెల్లడించారు. ఎవరూ డబ్బులు కట్టవద్దని, దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానం ప్రజలకు మద్దతు ఇస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్తామని వెల్లడించారు. ఎవరూ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవద్దని... క్రమబద్ధీకరణకు డబ్బులు చెల్లించవద్దని సూచించారు. కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక... ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:'కేసీఆర్ ఏదీ శాశ్వతం కాదు... ఏదో ఒకరోజు మేమూ అధికారంలోకి వస్తాం'