అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు, ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సికింద్రాబాద్ కోర్టు ఈనెల 22న షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 15 రోజులకోసారి బోయిన్‌పల్లి ఠాణాలో సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
చంచల్‌గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
బోయిన్‌ప్లలి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అపహరణ కేసులో షరతులతో కూడిన బెయిల్‌ను సికింద్రాబాద్ న్యాయస్థానం మంజూరు చేసింది.
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన భూమా అఖిలప్రియ
చంచల్‌గూడ జైలు వద్దకు అఖిలప్రియ బంధువులతో పాటు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి వచ్చిన అనుచరులు భారీగా చేరకోవడం వల్ల ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.
- ఇదీ చూడండి :అన్ని గ్రామాలకు నాబార్డ్ సేవలు: సీఎస్